లేటెస్ట్..తారక రత్న ఆరోగ్యంపై తాజా సమాచారం.!

లేటెస్ట్..తారక రత్న ఆరోగ్యంపై తాజా సమాచారం.!

Published on Jan 28, 2023 9:00 AM IST

నిన్న జనవరి 27న టాలీవుడ్ కి సంబంధించి పలు ఊహించని సంఘటనలు జరిగాయి. మరి వాటిలో నందమూరి వారి టాలెంటెడ్ నటుడు అయినటువంటి నందమూరి తారక రత్న తమ పార్టీ తెలుగుదేశం యువ అధ్యక్షుడు నారా లోకేష్ పాద యాత్రలో పాల్గొనగా ఊహించని విధంగా అభిమానులు అధిక సంఖ్యలో ధాటికి రావడంతో తాను తీవ్ర అస్వస్థత కి లోనయ్యారు. దీనితో వెంటనే హుటాహుటిన కుప్పం హాస్పిటల్ కి తరలించడం అలాగే తర్వాత బెంగళూరికి షిఫ్ట్ చేశారు.

మరి ఇప్పుడు తన యోగక్షేమాలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. మరి ఈ అర్ధ రాత్రి 12 గంటల సమయంలో అయితే తారక రత్న ను బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారట. అక్కడ డాక్టర్ ఉదయ్ నేతృత్వంలో తారకరత్నకు వైద్యం స్టార్ట్ అయ్యిందట. మరి ఈరోజు తారకరత్న ని కలవడానికి అయితే నారా చంద్రబాబు నాయుడు బయలుదేరనున్నారట. ఈరోజు సాయంత్రం నాలుగున్న సమయంలో విజయవాడ నుంచి చంద్రబాబు వెళ్లనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు