పవన్ – త్రివిక్రమ్ సినిమాలో కొత్త విశేషాలు ఇవేనట ?

11th, September 2017 - 04:59:34 PM


పవన్ కళ్యాణ్ 25వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకాక్ లో చిన్నపాటి షెడ్యూల్లో ఉన్న చిత్ర యూనిట్ అది పూర్తికాగానే యూరప్ బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఫిలిం నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో తండ్రి – కొడుకులు సెంటిమెంట్ మేజర్ హైలెట్ అని తెలుస్తోంది. గతంలో పవన్ – త్రివిక్రమ్ లు కలిసి చేసిన ‘అత్తారింటికి దారేది’ అత్తా – మేనల్లుళ్ళ అనుబంధం ప్రధాన అంశంగా రూపొంది మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండనుందట.

అంతేగాక ఈ చిత్రంలో దాదాపు 7 పోరాట సన్నివేశాలు ఉంటాయని కూడా అంటున్నారు. అయితే ఈ వార్తల పట్ల ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తిచేసుకోనున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇకపోతే ఈ చిత్రాన్ని 2018, జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.