“ఆదిపురుష్” షూట్ పై తాజా అప్డేట్స్.!

Published on Sep 30, 2021 11:13 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ స్టేజ్ షూట్ లోకి వచ్చేసింది. ఇప్పుడు శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రం బ్యాలన్స్ షూట్స్ పై మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ వినిపిస్తున్నాయి.

భారీ లెవెల్లో ప్లాన్ చేసిన ఈ కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటుండగా ఇంకా కొన్ని ప్యాచ్ వర్క్స్ అలాగే చిన్న చిన్న షెడ్యూల్స్ బ్యాలన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక వీటి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులని ఓంరౌత్ స్టార్ట్ చేయనున్నాడట. మరి ఈ చిత్రంలో సాయి అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు 11కి ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :