ప్రభాస్ “సలార్” పై సాలిడ్ అప్డేట్స్!

Published on Feb 12, 2023 10:01 pm IST


పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కేజీఎఫ్ సిరీస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ అనే పాన్ ఇండియా మూవీ ను తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇది గాసిప్ మాత్రమే అని, సలార్ స్వతంత్ర చిత్రం గా, ఒక్క పార్ట్ గానే రిలీజ్ అవుతుంది అంటూ కొద్ది రోజుల క్రితం నివేదికలు వచ్చాయి.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, సలార్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగం సెప్టెంబర్ 28 వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన పూర్తి షూటింగ్ ఈ నెల చివరిలో పూర్తి కానుంది. అయితే ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక చిత్రం ను కమిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ చిత్రం పూర్తి అయిన తరువాత సలార్2 పై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టానున్నారు.

ఈ పాన్ ఇండియా మూవీ లో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. జగపతి బాబు, పృథ్వి రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :