“సలార్” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Mar 16, 2023 9:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఇండియన్ సినిమా దగ్గర భారీ యాక్షన్ సినిమాగా వచ్చిన కేజీఎఫ్ 2 కి మించి ఈ సినిమా ఎన్నో రేట్లు యాక్షన్ ఎలిమెంట్స్ తో వేరే లెవెల్లో అయితే తెరకెక్కుతుంది.

మరి ఈ భారీ సినిమా షూటింగ్ అయితే ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ప్రస్తుతం మేకర్స్ అయితే షూటింగ్ ని ఇటలీ లో చేస్తున్నారట. అలాగే ఇప్పటివరకు షూటింగ్ అయితే 85 శాతం మేర కంప్లీట్ అయ్యిపోయిందట. దీనితో అయితే సలార్ రిలీజ్ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని తెలుస్తుంది. ఇక సినిమా అప్డేట్స్ అయితే ఈ జూలై లేదా ఆగస్ట్ నుంచి స్టార్ట్ కానుండగా ఈ సినిమాకి కూడా మేకర్స్ బర్రె రీచ్ వచ్చే ప్లానింగ్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :