“సర్కారు వారి పాట” మాసెస్ట్ ట్రైలర్ పై లేటెస్ట్ అప్డేట్స్.!

Published on Apr 26, 2022 1:00 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “సర్కారు వారి పాట” సినిమానే. లాస్ట్ టైం “సరిలేరు నీకెవ్వరు” సినిమా తర్వాత చేసిన సినిమా ఇదే కావడం దానికి దీనికి చాలా గ్యాప్ రావడంతో ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పటి వరకు ఎన్నో ట్రీట్ లు ఈ సినిమా నుంచి వచ్చి మరిన్ని అంచనాలు పెంచగా ఇప్పుడు ఈ సినిమా నుంచి మాసెస్ట్ ట్రైలర్ కోసం ఇంట్రెస్టింగ్ వార్తలే వినిపిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగా మంచి మాస్ లెవెల్ ఉండగా ఈ ట్రైలర్ ని ఈ ఏప్రిల్ 28నే రిలీజ్ చెయ్యబోతున్నారు అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

అలాగే ఇంకో పక్క ట్రైలర్ అయితే సిద్ధం అయ్యింది కానీ డేట్ కన్ఫర్మ్ కాలేదని కూడా మరో వెర్షన్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక అప్డేట్ వస్తే అందరికీ ఒక క్లారిటీ వస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :