విక్టరీ వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సైంధవ్. అనౌన్స్ మెంట్ గ్లింప్స్ తో అందరిలో మంచి ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ పై వెంకటేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా బాగా అంచనాలు ఉన్నాయి.
శ్రద్ధ శ్రీనాధ్, రుహాని శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న సైంధవ్ ని వాస్తవానికి డిసెంబర్ 22న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అయితే అదే డేట్ కి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ మూవీ సలార్ రిలీజ్ కి సిద్ధం అవడంతో తమ మూవీని సైంధవ్ టీమ్ జనవరికి వాయిదా వేసినట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.
కాగా మ్యాటర్ ఏమిటంటే, తమ మూవీ నుండి రేపు ఉదయం 11 గం. ల 7 ని. లకు మ్యాజివ్ అప్ డేట్ రానున్నట్లు సైంధవ్ మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసారు. కాగా అది మూవీ యొక్క లేటెస్ట్ రిలీజ్ డేట్ కి సంబంధించిందని తెలుస్తోంది. వెంకటేష్ కెరీర్ 75వ మూవీగా రూపొందుతోన్న సైంధవ్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.