ఫైనల్ గా “విజయ్ 12” అవైటెడ్ టైటిల్, టీజర్ కి డేట్ వచ్చేసింది.!

ఫైనల్ గా “విజయ్ 12” అవైటెడ్ టైటిల్, టీజర్ కి డేట్ వచ్చేసింది.!

Published on Feb 7, 2025 6:10 PM IST

మన టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా ఏంటో అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలయికలో విజయ్ కెరీర్లో 12వ సినిమాగా చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ లో హైప్ ఉంది. అయితే ఈ మధ్యలో ఈ సినిమా నుంచి అప్డేట్ టైటిల్ టీజర్ కి సంబంధించి రావాల్సి ఉంది కానీ రాలేదు. అయితే ఫైనల్ గా ఈ క్రేజీ అప్డేట్ పై ఇపుడు క్లారిటీ వచ్చేసింది.

మరి ఈ సినిమా తాలూకా టైటిల్ సహా టీజర్ ను కూడా ఈ ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు కన్ఫర్మ్ చేసేసారు. సో రౌడి హీరో ఫ్యాన్స్ ఆ రోజుకి రెడీ అయిపోవాల్సిందే. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు