లేటెస్ట్..ఓటిటిలో “RRR” బ్లాస్ట్ పై గుడ్ న్యూస్ ఇచ్చిన “జీ 5” వారు.!

Published on May 19, 2022 12:46 pm IST

ఇండియన్ సినిమా దగ్గర సిల్వర్ స్క్రీన్ పై మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఇప్పుడు మళ్ళీ ఓటిటి లో రిలీజ్ పై కూడా అంతే హైప్ తో సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని రేపిన ఈ చిత్రాన్ని సౌత్ భాషల్లో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అయినటువంటి జీ 5 వారు ఈ మే 20న బిగ్గెస్ట్ డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాని మొదట పే పర్ వ్యూ మోడ్ లో తీసుకొస్తామని తెలిపారు.

కానీ తర్వాత ఆడియెన్స్ నుంచి భారీ ఎత్తున డిమాండ్ రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని జీ 5 సబ్ స్క్రిప్షన్ ఉన్నవాళ్ళకి ఫ్రీ గా చూడొచ్చని ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని అందించారు. ఇది నిజంగా ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి. అయితే ఓటిటి లో అన్ కట్ వెర్షన్ కోసం కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మరి అది వస్తుందో లేదో చూడాలి. మొత్తానికి అయితే ఈ బిగ్ అప్డేట్ తో తారక్, చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :