ఎన్టీఆర్ కొత్త సినిమాకి ముహూర్తం కుదిరింది !


‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని చాలా కథలు విన్న ఎన్టీఆర్ చివరికి దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎన్టీఆర్ అంతమంది కథలను రిజెక్ట్ చేసి బాబీ కథను ఓకే చేయడంతో అందరిలోనూ ఆసక్తి ఎక్కువైంది. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న అధికారికంగా లాంచ్ చేసి ఫిబ్రవరి 15నుండి రెగ్యులర్ షూట్ ప్రారంబించనున్నట్టు కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా గొప్పగా రూపొందించాలని నిర్ణయించుకున్న కళ్యాణ్ రామ్ సాంకేతిక విభాగంలో బెస్ట్ టెక్నీషియన్స్ ఉండేలా చూస్తున్నాడు. అందులో భాగంగానే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నాడు.