మరో మెగా హీరో సరసన నటించనున్న లావణ్య త్రిపాఠి !
Published on Apr 17, 2017 12:29 pm IST


హీరోయిన్ లావణ్య త్రిపాఠి వరుస సినిమాలతో యమ బిజీ అయిపోతోంది. ఇప్పటికే రెండు తమిళ సినిమాలు, ఒక తెలుగు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె తాజాగా మరొక తెలుగు సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. అది కూడా మెగా హీరో సినిమా కావడం విశేషం. ఆ మెగా హీరో మరెవరో కాదు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం బివిఎస్ఎన్ రవి డైరెక్షన్లో ‘జవాన్’ సినిమా చేస్తున్న తేజ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తో ఒక సినిమా చేయనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో తేజ్ పక్కన లావణ్య అయితే బాగుంటుందని భావించిన నిర్మాతలు ఆమెను సంప్రదించారట. కథను, తన పాత్రను విన్న లావణ్య వెంటనే ప్రాజెక్టుకి ఓకే చెప్పారని తెలుస్తోంది. లావణ్య గతంలో మెగా హీరోలైన అల్లు శిరీష్ తో ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంలో అలాగే ఈ మధ్యే వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ లో నటించారు.

 
Like us on Facebook