హిట్ సినిమా రీమేక్ లో లావణ్య త్రిపాఠి !


హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరొక మంచి ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకుంది. తెలుగు సూపర్ హిట్ సినిమా ‘100% లవ్’ యొక్క తమిళ రీమేక్ లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. కొన్నాళ్ల క్రితమే అనౌన్స్ చేయబడ్డ ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా మొదట లావణ్యనే అనుకున్నప్పటికీ మధ్యలో హెబ్బా పటేల్ కూడా తెరపైకొచ్చింది. దీంతో అందరిలోనూ కాస్త కన్ఫ్యూజన్ తలెత్తింది.

చివరకు ఆ కన్ఫ్యూజన్ కు తెరదించుతూ లావణ్యను ఫైనల్ చేస్తున్నట్టు దర్శకుడు ఎం.ఎం. చంద్రమౌళి తెలిపారు. అంతేగాక ఈ సినిమా కోసం లావణ్య బరువు తగ్గి ఫిట్ సెక్స్ పెంచుకునే పనిలో ఉందని కూడా అన్నారు. ఈ రీమేక్లో నాగ చైతన్య పాత్రను హీరో జివి. ప్రకాష్ కుమార్ చేయనున్నాడు. ఇకపోతే లావణ్య మరొక తమిళ చిత్రం ‘మాయావన్’ లో సైతం కనిపించనుంది.