రామ్ సినిమాలో హీరోయిన్ మారింది ?


యంగ్ హీరో రామ్, కిశోర్ తిరుమలల చిత్రం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ఆనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. అయితే ముందుగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ లను అనుకున్నారు. కానీ ప్రస్తుతం మేఘా ఆకాష్ స్థానంలో లావణ్య త్రిపాఠిని తీసుకోనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

చిత్రానికి సైన్ చేసి ముహూర్తం ఫంక్షన్ కు కూడా హాజరైన మేఘా ఆకాష్ ప్రస్తుతం నితిన్ – హను రాఘవపూడిల ‘లై’ సినిమా యొక్క యూఎస్ షెడ్యూల్లో బిజీగా ఉండటం వలన రామ్ సినిమాకు డేట్స్ కుదర్చలేకపోతోందట. ఇక చేసేది లేక ప్రాజెక్ట్ డిలే కాకుండా ఆమె స్థానంలో లావణ్యను తీసుకున్నారట దర్శక నిర్మాతలు. సీనియర్ నిర్మాత స్రవంతి రవి కిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఆగష్టు 5న, చిత్రాన్ని సెప్టెంబర్ 30న రిలీజ్ చేయనున్నారు.