మరింత డోస్ తో ఫుల్ ఎంటర్టైనింగ్ గా లావణ్య “హ్యాపీ బర్త్ డే” ట్రైలర్.!

మరింత డోస్ తో ఫుల్ ఎంటర్టైనింగ్ గా లావణ్య “హ్యాపీ బర్త్ డే” ట్రైలర్.!

Published on Jun 29, 2022 4:21 PM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెయిన్ రోల్ లో వెన్నెల కిషోర్ మరియు కమెడియన్ సత్య లు కీలక పాత్రల్లో “మత్తు వదలరా” ఫేమ్ దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “హ్యాపీ బర్త్ డే” కోసం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో ఈ క్రేజీ కాంబో మరోసారి సరికొత్త ట్రీట్ ఇచ్చేలా కనిపించగా ఇప్పుడు దీనిపై అంచనాలు మరింత పెంచేలా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

అయితే ఈ ట్రైలర్ మాత్రం అప్పుడు టీజర్ కి మించి డబుల్ డోస్ తో సాలిడ్ ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా లావణ్య నుంచి వెన్నెల కిషోర్, సత్య ఇంకా రాకెట్ రాఘవ, తదితరులు సాలిడ్ పెర్ఫామెన్స్ లు ఈ ట్రైలర్ లో కనిపించారు. అలాగే గన్స్ తో పాటుగా ఈసారి ఇంకో కీలక వస్తువు చుట్టూ సినిమా కథ తిరిగేటట్టు చూపించడం మరింత ఆసక్తి పెంచింది.

ఇక లాస్ట్ లో అయితే తమ మత్తు వదలరా లో సీరియల్ ఫన్నీ ఎపిసోడ్ ని ఈ సినిమాలో కూడా చూపించడం మరో సర్ప్రైజింగ్ అండ్ ఫన్నీ గా ఉందని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ లో అయ్యితే సినిమాటోగ్రఫీ గాని కాల భైరవ మ్యూజిక్ గాని చాలా బాగున్నాయి. ఓవరాల్ గా అయితే మరో ఇంట్రెస్టింగ్ ఫన్ థ్రిల్ అయితే ఈ జూలై 8న థియేటర్స్ లో ఉంటుంది అనిపిస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు