మహేష్ కోసం మరో హీరోయిన్ రెడీ !

మహేష్ కోసం మరో హీరోయిన్ రెడీ !

Published on Nov 15, 2021 8:14 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించబోతుందని.. ఆ పాత్రలో ‘నభా నటేష్‌’ నటించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సెకండ్ హీరోయిన్ పై మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి కనిపించబోతుందని.. ఆమె పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుందని తెలుస్తోంది.

డిసెంబర్ నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మహేష్ పై సోలో సాంగ్ ను అలాగే ఒక ఫైట్ ను తీస్తారట. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు