విజయ్ దేవరకొండ సరనస అందాల రాక్షసి !


‘పెళ్లి చూపులు’ ఫేమ్ విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో బన్నీ వాసు నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ -2 పై పరశురామ్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాని మొదలుపెట్టాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరైన లావణ్య త్రిపాఠిని తీసుకుంటున్నారట.

అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ ఏంటి, ఇతర నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే విజయ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేసిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఈ ఆగష్టు 25న రిలీజ్ కానుంది.