ఇంటిమేట్ సీన్స్ కి నో చెబుతున్న హీరోయిన్ !

Published on May 25, 2020 5:23 pm IST

హీరోయిన్ లావణ్య త్రిపాఠి టాలెంట్ అండ్ గ్లామర్ పరంగా ఒక స్టార్ హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోదు. అయినా లావణ్య మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అర్జున్ సురవరం సినిమా రూపంలో రీసెంట్ గా మంచి హిట్ వచ్చినా లావణ్య కెరీర్ మాత్రం ఆ తరువాత ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. కాగా తాజాగా లావణ్య కిస్ సీన్స్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.

లావణ్య మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కరోనా లాంటి కష్టతరమైన పరిస్థితుల్లో సినిమాల్లో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించే విషయంలో ఆలోచించాల్సిందే. నేను అలాంటి సన్నివేశాలకు మాత్రం నో చెబుతాను. మన ఆరోగ్యం, చుట్టూ ఉన్న వారి ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదే అని నేను అనుకుంటున్నాను’ అని లావణ్య చెప్పుకొచ్చింది.

ఇక కరోనా పై పోరాటంలో భాగంగా అందరి హీరోయిన్స్ కంటే ముందే లక్ష రూపాయిలు విరాళంగా ప్రకటించి అందర్నీ ఆకట్టుకుంది లావణ్య.

సంబంధిత సమాచారం :

More