‘సైకియాట్రిస్ట్’ అవతారమెత్తిన హీరోయిన్ !

10th, December 2017 - 06:26:02 PM

2016 లో వచ్చిన ‘శ్రీరస్తు శుభమస్తు’ తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఆ స్థాయి విజయాన్ని అందించిన సినిమాలు పడలేదు. ఈ ఏడాది ఆమె చేసిన ‘మిస్టర్, రాధ, యుద్ధ శరణం’ వంటివి పరాజయాలుగా నిలవగా ఈ మధ్యే విడుదలైన ‘ఉన్నది ఒకటే జిందగీ’ పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు ఆమె ఆశలన్నీ తమిళంలో సందీప్ కిషన్ తో కలిసి చేసిన ‘మాయావన్’ మీదే ఉన్నాయి.

సివి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా ‘ప్రాజెక్ట్ జెడ్’ పేరుతో రిలీజ్ కానుంది. ఇందులో లావణ్య సైకియాట్రిస్ట్ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం అనేక క్రైమ్ డాక్యుమెంటరీలను చూసి చిన్నపాటి రీసెర్చ్ తో హోమ్ వర్క్ చేసి క్యారెక్టర్లో నటించారట. మరి ఈ సినిమా ఆమెకు ఎంతవరకు బ్రేక్ ఇస్తుందో చూడాలి. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.