లావణ్య త్రిపాఠి “హ్యాపీ బర్త్ డే” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

లావణ్య త్రిపాఠి “హ్యాపీ బర్త్ డే” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on Aug 2, 2022 9:00 AM IST

గత జూలై లో రిలీజ్ అయినటువంటి పలు చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్ లో వెన్నెల కిషోర్ మరియు కమెడియన్ సత్య లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “హ్యాపీ బర్త్ డే”. హిట్ చిత్రం “మత్తు వదలరా” దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. ఒక కొత్త తరహా ట్రీట్మెంట్ అంటూ వచ్చిన ఈ చిత్రం అయితే ఆడియెన్స్ ని పూర్తి స్థాయిలో ఎంటర్టైనర్ చెయ్యలేకపోయింది.

ఇక ఇప్పుడు అయితే ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ చిత్రం ఓటిటి హక్కులు కొనుగోలు చేసినటువంటి దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ పై క్లారిటీ ఇచ్చారు. తమ ఈ నెల స్ట్రీమింగ్స్ లో ఈ ఆగస్ట్ 8 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. మరి అప్పుడు మిస్సయిన వారు అయితే ఇప్పుడు ఈ సినిమా చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు