సూపర్ ఎంటర్టైనింగ్ గా లావణ్య త్రిపాఠి “హ్యాపీ బర్త్ డే” టీజర్.!

Published on Jun 7, 2022 11:21 am IST


రీసెంట్ గా మన తెలుగు యంగ్ ఫిల్మ్ మేకర్స్ నుంచి ఎలాంటి సబ్జెక్ట్ లు వస్తున్నాయో చూస్తున్నాము అలా తన ఫస్ట్ సినిమా “మత్తు వదలరా” తో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు రితేష్ రానా చేసిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “హ్యాపీ బర్త్ డే”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ ని ఇప్పుడు వదిలారు.

అయితే ఇది మాత్రం మాంచి ఇంట్రెస్టింగ్ గా అలాగే ఒకింత కేజ్రీగా ఉందని చెప్పాలి. గన్స్ లీగల్ అంటూ ఓ పొలిటీషియన్ గా వెన్నెల కిషోర్ కనిపించగా లావణ్య త్రిపాఠీ ఓ డాన్సర్ గా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గన్స్ టాపిక్ ఏంటి ఎలా ఇమిడింది అనేవి వెరీ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి.

అలాగే మత్తు వదలరా టైప్ లోనే హ్యూమర్ కూడా సాలిడ్ గా ఉండేలా అనిపిస్తుంది. ఇంకా కాల భైరవ మళ్ళీ తన ట్రెండీ మ్యూజిక్ తో అదరగొట్టాడు. ఓవరాల్ గా అయితే సూపర్ ఎంటర్టైనింగ్ గా ఈ టీజర్ అనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించగా ఈఈ జూలై 15న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :