లారెన్స్ ‘చంద్రముఖి – 2’ రన్ టైం లాక్

Published on Sep 15, 2023 11:00 pm IST

రాఘవ లారెన్స్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ హర్రర్ ఎంటర్టైనర్ మూవీ చంద్రముఖి 2. బాలీవుడ్ నటి కంగనా రనావత్ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ మూవీకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన ఈ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

అయితే లేటెస్ట్ అప్ అప్ డేట్ ప్రకారం ఈ మూవీ యొక్క రన్ టైం 170 నిముషాలు (2 గం. 50 ని.) అని తెలుస్తోంది. నిజానికి రన్ టైం పరంగా ఇది కొంత ఎక్కువే అయినప్పటికీ దర్శకుడు వాసు మూవీని ఎంతో ఆసక్తికర కథ, కథనాలతో మూవీని నడిపించారని, తప్పకుండా రిలీజ్ తరువాత చంద్రముఖి 2 మంచి విజయం అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :