
మొదట డాన్సర్, ఆ తర్వాత కొరియోగ్రాఫర్, అటుపై నటుడు, దర్శకుడిగా మారిన రాఘవ లారెన్స్ నుంచి రానున్న హర్రర్ కామెడీ ఫిల్మ్ ‘గంగ’. ‘ముని’, ‘కాంచన’ సినిమాలకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 17న తమిళంలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా సూపర్బ్ కలెక్షన్స్ ని కూడా రాబట్టుకుంటోంది. ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఫైనాన్సియల్ కారణాల వల్ల తెలుగులో రిలీజ్ వాయిదా పడింది. తాప్సీ, నిత్యా మీనన్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని మే 1న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగా రాఘవ లారెన్స్ తెలుగు వెర్షన్ కోసం స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నాడు. ముందుగా రిలీజ్ సందర్భంగా ఓ స్పెషల్ సాంగ్ ని షూట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ విషయాన్ని తాప్సీ స్వయంగా తెలియజేసింది. ‘కాంచన 2/గంగ సినిమా కోసం నేను చేయాల్సిన స్ట్రగుల్ అయిపోయిందని భావించాను, కానీ మాస్టర్ ఒక ప్రమోషనల్ సాంగ్ చేయాలని అన్నారు. నాకు సినిమాలో ఓ డాన్సింగ్ మెంబర్ మిస్ అయ్యిందనే కారణంతోనే ఈ సాంగ్ ప్లాన్ చేసుంటారని’ తాప్సీ ట్వీట్ చేసింది. త్వరలోనే షూట్ చేసి ఈ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. మరి తమిళం కంటే తెలుగులో కాస్త ఆలస్యంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఈ ప్రమోషనల్ సాంగ్స్ ఎంతవరకూ హెల్ప్ అవుతాయో చూడాలి.