భారీ ధర పలుకుతున్న ‘లై’ శాటిలైట్ రైట్స్ !
Published on Jul 16, 2017 6:37 pm IST


యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లై’ ఆరంభం నుండి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇటీవలే విడుదలైన టీజర్ కూడా బ్రహ్మాండంగా ఉండటంతో ఈ సినిమా పట్ల అందరిలోనూ పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. దీంతో సినిమా హక్కులు భారీ ధర పలుకుతున్నాయ్. ఫిల్మ్ నగర్ వాటాల ప్రకారం ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ రూ. 7 కోట్ల వరకు పలుకుతున్నాయట.

ప్రముఖ ఛానెల్ ఒకటి ఈ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉందని కూడా తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక అజరిగితే నితిన్ కెరీర్లో అత్యధిక శాటిలైట్ ధర పలికిన సినిమాగా ‘లై’ నిలుస్తుంది. ఆగష్టు 11న విడుదలకానున్న ఈ చిత్రంలో మేఘా హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook