‘ధమాకా’లో లెక్చరర్ లవ్ ట్రాకే మెయిన్ హైలైట్ !

Published on Feb 15, 2022 11:30 am IST

మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవితేజ, నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా టైటిల్ ‘ధమాకా’ ‘డబుల్ ఇంపాక్ట్’… అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లిసందడి ఫేమ్ ‘శ్రీలీల’ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.

అయితే, ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. అందులో ఒక పాత్ర కాలేజీ లెక్చరర్ పాత్ర అని.. ‘శ్రీలీల’ స్టూడెంట్ గా కనిపించబోతుంది అని.. లెక్చరర్ తో ప్రేమలో పడే స్టూడెంట్ గా ‘శ్రీలీల’ నటిస్తోందని తెలుస్తోంది. అలాగే ఈ లెక్చరర్ లవ్ ట్రాక్ సినిమాలోనే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

ముఖ్యంగా రవితేజ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. కిక్ సినిమాలోని రవితేజ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది. రవితేజ ఖిలాడీ సినిమా కూడా రిలీజ్ రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :