నంది అవార్డుల్ని గెలుచుకున్న ‘బాహుబలి, లెజెండ్’ సినిమాలు !

తెలుగు సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల్ని ప్రకటించారు. 2014, 15, 16 మూడు సంవత్సరాలకు ఒకేసారి ఈ అవార్డుల్ని ప్రకటించారు. ఈ ప్రకటనలో ముందుగా నంది అవార్డులను గెలుచుకున్న ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేశారు.

2014 వ సంవత్సరానికిగాను బాలక్రిష్ణ, బోయపాటి శీనుల కలయికలో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ చిత్రం ‘లెజెండ్’ అవార్డును సొంతం చేసుకోగా 2015వ సంవత్సరానికిగాను రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి – ది బిగినింగ్’ నందిని కైవసం చేసుకుంది. అలాగే 2016కు చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండల ‘పెళ్లి చూపులు’ నంది ఎంపికైంది.