వైరల్ : యువ నటుడు సుహాస్ కి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఆశీర్వాదం..!

Published on Aug 17, 2022 8:01 am IST

టాలీవుడ్ లో టాలెంట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ తో పని లేదని ఎంతో మంది నటులు ప్రూవ్ చేసారు. మతి అలాగే ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై చిన్న చిన్న ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ హీరోగా కూడా సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న యువ నటుడు సుహాస్ కోసం ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరి రీసెంట్ గానే తమ సినిమా “కలర్ ఫోటో” కి నేషనల్ అవార్డ్ అందుకున్న ఈ యంగ్ నటుడు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. మన టాలీవుడ్ దిగ్గజ కమెడియన్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తో కలిసి ఉన్న ఫోటో ని తాను షేర్ చేసుకున్నాడు.

మరి దీనిలో తనకి బ్రహ్మానందం ఆశీస్సులు అందించినట్టుగా ఓ కార్డు పై తాను రాసిన పిక్ కూడా షేర్ చేసుకొని ఈ యువ నటుడు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశాడు. మరి దీనిలో అయితే బ్రహ్మానందం సుహాస్ కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని శుభమస్తు అంటూ పొందుపరిచారు. దీనితో ఈ పోస్ట్ ఇపుడు మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :