విషాదం : బాలీవుడ్ నటుడు మృతి

Published on Jun 5, 2023 4:22 pm IST

భారత సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు గుఫి పైంతాల్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పైంతాల్ మహాభారత్ సీరియల్లో ‘శకుని మామ’ పాత్ర పోషించి ప్రేక్షకుల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. పలు హిందీ సినిమాలు, సీరియళ్లలోనూ నటించారు.

గుఫి పైంతాల్ మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గుఫి పైంతాల్ మృతిపై పలువురు హిందీ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. 123తెలుగు.కామ్ తరఫున గుఫి పైంతాల్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :