రెండో సినిమాను మొద‌లుపెట్టిన లెజెండ్ శ‌ర‌వ‌ణ‌న్

రెండో సినిమాను మొద‌లుపెట్టిన లెజెండ్ శ‌ర‌వ‌ణ‌న్

Published on Jun 24, 2024 2:42 PM IST

వ్యాపార‌వేత్త నుండి హీరోగా మారిన ‘లెజెండ్’ శ‌ర‌వ‌ణ‌న్ త‌న తొలి సినిమా ‘లెజెండ్’తో ప్రేక్ష‌కుల్లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. సినిమాల‌పై ప్యాష‌న్ తో ఆయ‌న హీరోగా ‘లెజెండ్’ సినిమాతో తెరంగేట్రం చేయ‌డం ప్రేక్ష‌కుల‌కు బాగా నచ్చింది. ఇక సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా, ఆయ‌న త‌నకంటూ ఓ ప్ర‌త్యేక మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు.

అయితే, ఇప్పుడు ఈ హీరో త‌న రెండో సినిమాను స్టార్ట్ చేశారు. ద‌ర్శ‌కుడు దురై సెంథిల్ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ ను సోమ‌వారం రోజున అఫీషియ‌ల్ గా స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో ‘లెజెండ్’ శ‌ర‌వ‌ణ‌న్ సరికొత్త మేకోవ‌ర్ తో క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు సంబంధించిన లుక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న‌దైన మార్క్ వేసుకోవాల‌ని లెజెండ్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ సినిమాలోని న‌టీన‌టులు, మిగ‌తా టెక్నీషియ‌న్ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు