పైరసీపై హై కోర్టుకి వెళ్ళిన స్టార్ డైరెక్టర్

mani-ratnam
స్టార్ డైరెక్టర్ మణిరత్నం చాలా తర్వాత రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఓకే కన్మణి’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తిలీజ్ అయిన ఈ సినిమా రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. చాలా రోజుల తర్వాత వచ్చిన హిట్ ని ఆస్వాదిస్తున్న మణిరత్నంని అందరి డైరెక్టర్స్ లానే పైరసీ భూతం డిస్టర్బ్ చేసింది. ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నా అప్పుడే తమిళ్ వెర్షన్ క్లియర్ ప్రింట్స్ నెట్ లో దర్శనమిస్తున్నాయి. దాంతో మణిరత్నం వెంటనే హై కోర్టులో కేసు వేసాడు.

నిన్న మణిరత్నం చెన్నైకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అయిన 12 మంది మీద, అలాగే ఓకే కన్మణి ప్రింట్స్ ని ఆల్ లైన్ లో ఉంచిన రెండు వే సైట్స్ మీద కేసు ఫెయిల్ చేసాడు. హై కోర్టు కూడా ఏ మాత్రం జాప్యం లేకుండా వెంటనే వాళ్ళందరినీ, ఆ రెండు వెబ్ సైట్స్ ని బాన్ చెయ్యాలని ఆదేశాలను జారీ చేసింది. మణిరత్నం ఇచ్చిన పిటీషన్ లో వెబ్ సైట్స్ అడ్రస్ యాక్సెస్ ని బ్లాక్ చేయడం మరియు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ సహకరిస్తేనే పైరసీ భూతాన్ని రూపుమాపగలం అని పేర్కొన్నాడు.

Exit mobile version