అగ్నిప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కమల్ !


లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు.చెన్నై లోని ఆయన నివాసంలో నేటి ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.తాను క్షేమంగా బయటపడ్డానని కమల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

అప్రమత్తంగా మెలిగిన తన సిబ్బందికి కమల్ ధన్యవాదాలు తెలిపాడు.మంటలు వ్యాపించడంతో మూడో ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా క్రిందకు దిగానని కమల్ అన్నారు.ఈ ఘటన గురించి తెలుసుకున్న కమల్ సన్నిహితులు ఆయన్ని పరామర్శిస్తున్నారు.