క్యానెస్ గ్రాండ్ ఈవెంట్ దగ్గర కమల్, ఏ ఆర్ రెహమాన్.!

Published on May 18, 2022 3:30 pm IST

తాజాగా ఫ్రాన్స్ లో ప్రముఖ క్యానెస్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ గ్రాండ్ వేడుకకి గాను ఆల్రెడీ మన ఇండియన్ సినిమా దగ్గర అనేక మంది సినీ తారలకు ఆహ్వానం అండగా ఆల్రెడీ చాలా మంది తారలు ముందే పయనం అయ్యారు.

ఇప్పటికీ పలువురు బిగ్ స్టార్స్ కూడా హాజరు అవుతుండగా లేటెస్ట్ గా విశ్వ నటుడు కమల్ హాసన్ అలాగే ఇండియన్ సినిమా దగ్గర దిగ్గజ సంగీత దర్శకుడు అయినటువంటి ఏ ఆర్ రెహమాన్ లు కూడా హాజరు కావడం పైగా వారిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఇప్పుడు సినీ వర్గాల్లో మంచి వైరల్ అవుతుంది.

అలాగే ఈ కాంబో కోసం కూడా మంచి టాక్ లు నడుస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా కమల్ నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “విక్రమ్” రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా ట్రైలర్ కి కూడా భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత సమాచారం :