అక్కినేని అఖిల్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రస్తుతం థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతూ బయ్యర్లకు లాభాల పంట పండిస్తోంది.
ఈ సినిమా సాధిస్తున్న విజయానికి మంచి కంటెంట్, నటీనటుల ప్రతిభతో పాటు అందుబాటులో ఉన్న టికెట్ ధరలు కూడా ప్రధాన కారణమయ్యాయి. ఇప్పటివరకు బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్ ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి ఏకంగా 1.5 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవడం విశేషం. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది.
మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించాడు. శివాజీ, ప్రమోద్ పంజు, ఈశ్వరి రావు, సునీల్, రామ్కీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
