ఇళయదళపతి విజయ్ తాజా భారీ పాన్ ఇండియా మూవీ లియో పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే లియో నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
అతి త్వరలో సెకండ్ సాంగ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది లియో టీమ్. అయితే విషయం ఏమిటంటే, తాజా కోలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 30 నెహ్రు ఇండోర్ స్టేడియం, చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించేందుకు యూనిట్ ఆలోచన చేస్తోందట. అతి త్వరలో దీని పై అఫీషియల్ గా వారి నుండి కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. కాగా లియో మూవీ అక్టోబర్ 19న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలక పాత్రలు చేస్తున్నారు.