అక్కడ “RRR” ని మించి “లియో”కి.!

Published on Sep 23, 2023 8:02 am IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే మరో గ్లోబల్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ గ్లోబల్ హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే ఇండియన్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే యూఎస్ లో ఈ చిత్రం నెవర్ బిఫోర్ రిలీజ్ కూడా అయ్యింది.

అక్కడ ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో అయితే దాదాపు 80 స్క్రీన్స్ లో హైయెస్ట్ రిలీజ్ అయ్యిన ఇండియన్ సినిమాగా నిలవగా ఇప్పుడు దీనిలో తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన “లియో” చిత్రం RRR రికార్డుని బ్రేక్ చేసినట్టుగా తెలుస్తుంది. లియో కి 80 కి పైగా ఐమ్యాక్స్ స్క్రీన్స్ దక్కాయట. దీనితో RRR ని మించే ఈ సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ అక్టోబర్ 19న సినిమా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :