ఇంట్రెస్టింగ్..అప్పుడే “లియో” సగం పూర్తి?

Published on Mar 11, 2023 6:03 pm IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో అయితే ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా త్రిష హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం వహిస్తున్న సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “లియో” కూడా ఒకటి. అనౌన్సమెంట్ తో పాటుగా ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఓ సినిమాగా వస్తుండడంతో హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది.

అయితే చాలా క్లారిటీ తో ఉండే లోకేష్ కనగ రాజ్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నాడట. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఈ స్పీడ్ లో ఈ మార్చ్ చివరకి అప్పుడే సినిమా షూటింగ్ సగం పూర్తయ్యిపోతుందట. దీని బట్టి అసలు చిత్ర యూనిట్ ఏ రేంజ్ లో వర్క్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :