“లియో” ఫైనల్ షెడ్యూల్ డీటైల్స్ ఇవే!

Published on May 11, 2023 1:30 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాబోయే యాక్షన్ డ్రామా లియో మరోసారి వార్తల్లో నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. విజయ్, అర్జున్ సర్జాలకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. మరో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే, ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ వేస్తున్నారు. ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఈ బిగ్గీలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ బిగ్గీకి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీ అక్టోబర్ 19, 2023న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :