‘లియో’ సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Sep 27, 2023 8:00 pm IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ లియో పై అందరిలో మొదటి నుండి ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మాతగా సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మితం అవుతున్న లియో యొక్క ఆడియో ఫంక్షన్ సెప్టెంబర్ 30న నిర్వహించాలని భావించింది యూనిట్.

అయితే ఎక్కువగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉండడంతో సెక్యూరిటీ ఇష్యూస్ వలన దానిని క్యాన్సిల్ చేసారు. అయితే మూవీ నుండి వరుసగా అప్ డేట్స్ వస్తాయని తెలిపిన మేకర్స్, లియో నుండి బ్యాడ్ యాస్ పల్లవి తో సాగె సెకండ్ సాంగ్ ని రేపు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 19, 2023న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :