యూకేలో సెన్సేషనల్ బుకింగ్స్ తో “లియో”

Published on Sep 12, 2023 1:00 pm IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా త్రిష హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా “లియో” కోసం అందరికీ తెలిసిందే. మరి క్రేజీ హైప్ ఉన్న ఈ చిత్రాన్ని ఈ దసరా కానుకగా రిలీజ్ కి సిద్ధం చేస్తుండగా మరి ఈ చిత్రం బుకింగ్స్ ని అయితే ఆల్రెడీ యూకే కి సంబంధించి మేకర్స్ ఇప్పటికే ఓపెన్ చేయగా అక్కడ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే 10 వేలకి పైగా టికెట్స్ బుక్ అయ్యి రికార్డు సెట్ చేయగా.

ఇప్పుడు ఈ చిత్రం యూకే లో ఏకంగా 18 వేల టికెట్స్ ని ప్రీ సేల్స్ లో అయితే బుక్ చేసుకుంది. దీనితో ఈ సినిమా కోసం అక్కడ ఆడియెన్స్ ఎంత ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా 7 స్క్రీన్ స్టూడియోస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, అర్జున్ లాంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు.

సంబంధిత సమాచారం :