ఇంట్రెస్టింగ్ గా ‘లియో’ తమిళ పోస్టర్

Published on Sep 20, 2023 7:05 pm IST


ఇళయదళపతి విజయ్ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్, మాథ్యూ థామస్, ప్రియా ఆనంద్, శాండీ మాస్టర్, బాబు ఆంటోని, మనోబాల, జార్జ్ మేరియన్, అభిరామి వెంకటాచలం తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఇక ఈ మూవీ పై మేకర్స్ ఎప్పటికప్పుడు అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్ ఫీస్ట్ లో భాగంగా లియో నుండి తెలుగు, కన్నడ పోస్టర్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా తమిళ్ పోస్టర్ ని విడుదల చేసారు. కీప్ కామ్ అండ్ ప్రిపేర్ ఫర్ ది బ్యాటిల్ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ 19న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :