పెయిడ్ ప్రీమియర్స్ ను ప్లాన్ చేస్తున్న “లియో” టీమ్!

Published on Sep 13, 2023 11:03 am IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం లియో. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే యూకే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్, సంజయ్ దత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వీరికి సంబందించిన టీజర్ లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

తాజా బజ్ ప్రకారం, చిత్ర బృందం తమిళనాడులో విడుదలకు ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 18న పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతులు లేకపోవడంతో టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ రూమర్ నిజమని తేలితే, ఇండియాలోని ఇతర ప్రాంతాలలో ప్రీమియర్ షోలను షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోకి చెందిన SS లలిత్ కుమార్ నిర్మించిన లియోలో ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మాథ్యూ థామస్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవి చందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :