స్పీడు పెంచుతున్న నితిన్
Published on Jun 12, 2017 4:14 pm IST


యంగ్ హీరో నితిన్ ‘ లై’ చిత్ర ప్రమోషన్ ల జోరు పెరిగింది. భారీ హంగులతో తెరెకెక్కతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.రొమాంటిక్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనే జరగడం విశేషం.గడ్డంతో సరికొత్త గెటప్ లో నితిన్ లుక్ సినీవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి.

ఇటీవలే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మేఘా ఆకాష్ లుక్ ని విడుదల చేశారు. కాగా నేడు ఈ చిత్రంలో మణిశర్మ సంగీతం అందించిన ‘ బొంబాత్’ అనే పాటని కూడా విడుదల చేయడం విశేషం.అమెరికాలోని దాదాపు 75 పాటు జరిపిన భారీ షెడ్యూల్ పూర్తయింది. దీనితో లై చిత్ర యూనిట్ ప్రమోషన్ పై దృష్టి పెట్టింది. చిత్ర టీమ్ ఈ నెల 13 న ఇండియా తిరిగి రానుంది.మిగిలిన భాగాన్ని ఇక్కడే షూట్ చేస్తారు.సీనియర్ హీరో అర్జున్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయనున్నారు. హనురాఘవ పూడి ఈ చిత్రానికి దర్శకుడు.

 
Like us on Facebook