“ఎఫ్ 3” నుండి లైఫ్ అంటే ఇట్టా ఉండాలా సాంగ్ రిలీజ్ కి రెడీ!

Published on May 15, 2022 8:26 pm IST

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రం లో తమన్నా భాటియా, మెహ్రిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సునీల్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఈ చిత్రం లో స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే ఆడి పాడింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభించింది.

ఈ చిత్రం నుండి సిసలైన సాంగ్ లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అనే సాంగ్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను సరికొత్త పోస్టర్ ద్వారా చేయడం జరిగింది. ఈ పాట కి సంబంధించిన ప్రోమో ను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తుండగా, ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను మే 17 న విడుదల చేయనుంది చిత్ర యూనిట్. మే 27 న విడుదల కానున్న ఈ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :