లైఫ్ అంటే ఇట్టా ఉండాలంటున్న పూజా హెగ్డే !

Published on May 16, 2022 10:14 am IST

విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అనే సాంగ్ ప్రోమోను విడుదల చేసారు మేకర్స్. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ సాంగ్ లో వెంకీ – వరుణ్ పోటీ పడి మరీ స్టెప్స్ వేశారు. ఈ ప్రోమోలో పూజా గ్లామర్ హైలైట్ గా ఉంది. ఎఫ్ 3లోనే అసలు సిసలైన స్పెషల్ సాంగ్ గా ఈ సాంగ్ రాబోతుంది.

ఇక ఎఫ్ 2 కి సీక్వెల్ అంటేనే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. అందుకే మొదటి నుండి అనిల్ రావిపూడి ఈ సినిమా పై మరింత కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగా సినిమా తీశాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తన ఎనర్జిటిక్ సాంగ్స్ తో సినిమా స్థాయిని పెంచుతున్నాడు దేవి. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :