‘లైగర్’ నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్….!

Published on Jul 8, 2022 4:58 pm IST


విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ లైగర్. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్ కి జోడీగా నటిస్తున్న ఈ మూవీలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక రోల్ చేస్తుండగా సీనియర్ నటి రమ్య కృష్ణ విజయ్ కి తల్లిగా నటిస్తున్నారు. విక్రమ్ మంట్రోస్, తనిస్క్ బాగ్చి, సునీల్ కశ్యప్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. విజయ్ కిక్ బాక్సర్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ అయిన అక్డి పక్డీ అనే పల్లవి తో సాంగ్ ప్రోమో నీ కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్.

పక్కా మాస్ స్టైల్ లో సాగే ఈ పార్టీ సాంగ్ ప్రోమోలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య ఇద్దరూ కూడా డ్యాన్స్ అదరగొట్టారు. మాస్ బీట్ తో సాగే ఈ ప్రోమో ప్రస్తుతం యుట్యూబ్ లో అందరినీ ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ రాబడుతోంది. కాగా ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని ఈనెల 11న సాయంత్రం 4 గం. లకు విడుదల చేయనున్నారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య్రమాలు జరుపుకుంటున్న లైగర్ ఆగస్ట్ 25న గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :