వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “లైగర్”

Published on Dec 4, 2022 7:00 pm IST


యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా లైగర్. ఈ పాన్ ఇండియా మూవీ భారీ అంచనాల నడుమ దేశ వ్యాప్తంగా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పూరి జగన్నాధ్ రేంజ్ లో లేకపోవడంతో కంటెంట్ అభిమానులను నిరాశ పరిచింది. అంతేకాక ఈ సినిమా కొన్ని లీగల్ సమస్యల కారణంగా కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది. డిసెంబర్ 11న సాయంత్రం 06:00 గంటలకు స్టార్ మాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. మరి స్మాల్ స్క్రీన్‌లపై ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రం తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. ఈ చిత్రం లో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ నటించగా, బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటించారు. ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, పూరీ జగన్నాధ్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :