పక్కా పూరీ మార్క్ లో అదిరిపోయిన “లైగర్” గ్లింప్స్.!

Published on Dec 31, 2021 10:37 am IST

టాలీవుడ్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో పాన్ ఇండియన్ సినిమా “లైగర్”. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ప్లాన్ చేసిన ఈ సినిమా పూరి హిట్ జానర్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ గ్లింప్స్ ని ఈరోజు రిలీజ్ చేశారు.

మరి ఈ గ్లింప్స్ మాత్రం ఫస్ట్ సెకండ్ నుంచి లాస్ట్ వరకు పక్కాగా పూరి జగన్నాథ్ మాస్ మార్క్ లో అదిరిపోయిందని చెప్పాలి. ఆ వరల్డ్ ఫేమస్ బాక్సింగ్ సెటప్ గాని విజయ్ ముంబై సిటీ చిన్న స్లమ్ నుంచి ఇండియా బాక్సర్ గా ప్రపంచ స్థాయికి ఎలా ఎదిగాడు అని చూపించే విజువల్స్ అన్నీ సాలిడ్ గా ఉన్నాయి.

అలాగే ముఖ్యంగా విజయ్ కోసం మాట్లాడుకోవాలి. తన ఫైట్ మూవ్స్ చూస్తుంటే రియల్ ఫైటర్ లానే కనిపిస్తున్నాడు. పైగా విజయ్ ఫ్యాన్స్ ఆశించే యాటిట్యూడ్ లో కూడా తన మార్క్ చూపించాడు. మొత్తానికి మాత్రం ఈ గ్లింప్స్ అద్దిరిపోయింది. ఇక ముందు ముందు అప్డేట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :