పూరి మార్క్ లో ఇంట్రెస్టింగ్ గా “లైగర్” లేటెస్ట్ మాస్ అప్డేట్.!

Published on Jul 29, 2022 9:10 am IST

మన టాలీవుడ్ రౌడీ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన హిట్ జానర్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇపుడు అయితే మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ లో మరో మాస్ అప్డేట్ ని అందించారు.

సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ మిక్స్ సాంగ్ లా విజయ్ దేవరకొండ డైలాగ్స్ తో ఈ వాట్ లాగా దేంగే అదిరిపోయింది. అలాగే ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మాస్ యాటిట్యూడ్ తన లుక్స్ అన్నీ కూడా సాలిడ్ గా ఉన్నాయి. అంతే కాకుండా సాంగ్ సహా విజువల్స్ లో అయితే పూరి ఫ్లేవర్ సూపర్బ్ గా కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ క్రేజీ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం ఈ ఆగస్ట్ 25న రిలీజ్ అవ్వనుంది.

వీడియో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :