ముగింపు దశలో “లైగర్”.. తాజా షెడ్యూల్ అమెరికాలో ప్లాన్..!

Published on Nov 8, 2021 10:44 pm IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్‌గా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “లైగర్”. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రముఖ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే పూరీ స్పీడుకి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కరోనా కారణంగా షూటింగ్‌కి పలుమార్లు అంతరాయం కలిగింది. దీంతో దొరికిన సమయాన్నే వాడుకున్న పూరీ చాలా వరకు ఈ సినిమా షూటింగ్‌ని జరుపుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీన లైగర్ టీమ్ మొత్తం అమెరికా వెళ్లి అక్కడ షూటింగ్‌ని జరుపుకోనున్నారు.

సంబంధిత సమాచారం :

More