లైగర్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్..!

Published on Dec 29, 2021 10:31 am IST

విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుంది. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ పతాకం పై ఈ చిత్రం ను కరణ్ జోహార్, ఛార్మి, అపూర్వ మెహతా, హిరూ యశ్ జోహార్, పూరి జగన్నాథ్ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన వరుస అప్డేట్స్ ను చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా గ్లింప్స్ రిలీజ్ టైం పై చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 31 వ తేదీన 10:03 గంటలకు గ్లింప్స్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం లో ప్రముఖ లెజెండరీ బాక్సర్ అయిన మైక్ టైసన్ కీలక పాత్ర లో నటిస్తుండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :