ఒక్కసారిగా అంచనాలు నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయిన “లైగర్” ట్రైలర్..!

Published on Jul 21, 2022 9:35 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ యంగ్ హీరోలు నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ట్రూ గా భారీ స్థాయి హైప్ ని నెలకొల్పుకున్న ఉన్న చిత్రం “లైగర్”. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. అయితే కాస్టింగ్, పోస్టర్ లు, అప్డేట్స్ అన్నీ కూడా సినిమాపై మంచి ఆసక్తిని రేపాయి కానీ..

ఇప్పుడు అవైటింగ్ ఎదురు చూస్తున్న ట్రైలర్ చూసాక మాత్రం అవన్నీ ఒకెత్తు ఈ ట్రైలర్ మాత్రం ఇంకో ఎత్తు అనిపించేలా ఉందని చెప్పాలి. డెఫినెట్ గా పూరీ విషయంలో చాలామందికి ఉన్న డౌట్స్ ని ఈ సాలిడ్ ట్రైలర్ కట్ తీర్చేస్తుందని చెప్పాలి. చాలా వరకు వింటేజ్ పూరి మార్క్ లోనే ఈ ట్రైలర్ విజువల్స్ కనిపించడం మంచి ట్రీట్ లా కనిపిస్తుంది.

ఇక హీరో విజయ్ దేవరకొండ అయితే ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ పక్కన పెడితే నటుడుగా ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కేలా కనిపిస్తున్నాడు. ఇంకా ఫైటర్ గా సాలిడ్ గా కనిపిస్తూ యాక్టింగ్ లుక్స్ పరంగా తాను అదరగొట్టాడని చెప్పాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో స్కోర్ కూడా అదిరిపోయింది.

ఇంకా సీనియర్ నటి రమ్య కృష్ణ తో పూరి తనదైన మాస్ రోల్ చేయించాడు. అలాగే హీరోయిన్ అనన్య పాండే కూడా మంచి గ్లామ్ గా కనిపించింది. ఇక ఫైనల్ బ్లాస్ట్ గా మాత్రం సెన్సేషన్ మైక్ టైసన్ ఎంట్రీ అన్నీ కూడా ఈ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు వేరే లెవెల్లోకి తీసుకెళ్లిపోయాయి. డెఫినెట్ గా అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ నే అందుకునేలా ఉందని చెప్పొచ్చు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :